Thursday, May 2, 2024

కెనడాలో ‘ఖలిస్థానీ’ నిరసనలపై స్పందించిన ప్రధాని ట్రూడో..!!

spot_img

న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం భారత్‌ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రూడో.. కెనడాలో ఖలిస్థానీ నిరసనలపై చర్చించుకున్నట్లు పేర్కొన్నారు.

Also Read.. తిరుమల పవిత్రతను కాపాడాలి

కెనడా ఎల్లప్పుడూ భావవ్యక్తీకరణ, శాంతియుత నిరసన స్వేచ్ఛ హక్కులను కాపాడుతుందన్నారు. అదే సమయంలో హింసను నిరోధించేందుకు, విద్వేషానికి వ్యతిరేకంగా చర్యలూ తీసుకుంటుందని చెప్పారు. అదే విధంగా దేశంలో ఓ వర్గం ఆధ్వర్యంలో సాగే కార్యకలాపాలు.. మొత్తం ఆ వర్గానికి, లేదా కెనడాకు ప్రాతినిధ్యం వహించవని ట్రూడో స్పష్టం చేశారు.

Also Read.. రూ. లక్షలోపు ఉన్న బెస్ట్ మైలేజ్ బైక్స్ ఇవే..!!

ఇదిలా ఉండగా.. కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రూడో ప్రభుత్వం ఖలిస్థానీ నిరసనలపై చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.

Latest News

More Articles