Tuesday, May 21, 2024

లక్ష కుటుంబాలకు రైతుబీమా.. ఐదేండ్లలో 5,039 కోట్ల పరిహారం

spot_img

హైదరాబాద్‌: అన్నదాతలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు తెచ్చిన ‘రైతుబీమా’ పథకం లక్ష రైతు కుటుంబాలకు అండగా నిలిచింది. 5 ఏండ్లలో రూ. 5,039 కోట్ల పరిహారం కింద అందజేశారు.

2018 ఆగస్టు 14న ప్రారంభమైన రైతు బీమా పథకం కింద 1,00,782 మంది రైతులకు పరిహారం అందించారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ.5,036.10 కోట్లను పరిహారం కింద ప్రభుత్వం తరఫున ఎల్‌ఐసీ చెల్లించింది.

గత 5 ఏండ్లలో రైతుల తరఫున ఎల్‌ఐసీకి రూ. 5,383.83 కోట్లను కేసీఆర్ ప్రభుత్వం ప్రీమియంగా చెల్లించింది. ఏటా ప్రీమియం పెరుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం వెనుకంజ వేయడం లేదు.

జనరల్‌ ఇన్సూరెన్స్‌ కింద 18-59 ఏళ్ల లోపు ఉండి.. గుంట భూమి ఉన్నా.. రైతుబీమాకు అర్హత ఉంటుంది అన్నదాత ఏవిధంగా మరణించినా అతడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతుంది.

Latest News

More Articles