Friday, May 17, 2024

మరో మైలురాయి చేరుకున్న ‘కంటివెలుగు’

spot_img

హైదరాబాద్‌: అంధత్వ రహిత తెలంగాణ సాధించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు రెండో విడత కార్యక్రమం మరో మైలురాయికి చేరుకుంది. కేవలం 80 పనిదినాల్లో కోటిన్నర పరీక్షలు నిర్వహించిన అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నది.

2023 జనవరి 18న ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,500 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. 18 ఏండ్లకు పైబడిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 19 నాటికి (79 రోజుల్లో) 1.49 కోట్ల మందికి కంటి పరీక్షలు పూర్తిచేశారు.

కాగా, ఇప్పటివరకు నిర్వహించిన కంటి పరీక్షల్లో 38.39 లక్షల మందికి కంటి సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం సంఖ్యలో ఇది 25 శాతం కావడం గమనార్హం. 1.10 కోట్ల మందికి ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించారు. వీరిలో అవసరమైన వారందరికి కంటి అద్దాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు.

Latest News

More Articles