Tuesday, May 14, 2024

‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’కు ఏ సర్టిఫికేట్: రన్ టైమ్ ఎంతో తెలుసా?

spot_img

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ తాజాగా నటించిన ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. దీని రన్‌టైమ్‌ పైన సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.  ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కు సెన్సార్ బోర్డు ‘ఏ’(A) సర్టిఫికెట్‌ను ఇచ్చింది. ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ 2గంటల 55నిమిషాలు ఉంది.

Also Read.. చింతపల్లి ఎస్‌ఐ సతీష్ రెడ్డి సస్పెండ్

కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు రన్‌టైమ్‌ను పట్టించుకోరని, ఇటీవల వచ్చిన ‘యానిమల్‌’ మూడు గంటలకు పైగా నిడివి ఉన్నప్పటికీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి రికార్డులు సృష్టించిందని చిత్రవర్గాలు తెలిపాయి. ఇక రెండు భాగాలుగా అలరించనున్న ‘సలార్‌’.. మొదటి పార్ట్‌ డిసెంబర్‌ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read.. ఒక్కరోజే 166 కొత్త కొవిడ్‌ కేసులు

ఇటీవల రిలీజైన టీజర్‌, ట్రైలర్‌లోనూ ప్రభాస్‌ ఎలివేషన్స్‌ ఆకట్టుకోవడంతో సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించగా.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.

Latest News

More Articles