Sunday, May 12, 2024

రేవంత్ రెడ్డి..గాడిదకు రంగేసినంత మాత్రాన సింహంగా మారదు

spot_img

సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారుబీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిన విషయంపై ఘాటుగా స్పందించారు. సీఎం పదవికి ఉన్న గౌరవాన్ని రేవంత్ రెడ్డి పూర్తిగా తగ్గించేస్తున్నారు.గౌరవప్రదమైన పదవిలో ఉండి అవాస్తవాలు, అర్ధసత్యాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు సతీష్ రెడ్డి.
కేసీఆర్‌కు చెప్పే చట్టంలో పొందుపరిచారని చెబుతున్న రేవంత్ రెడ్డి అవివేకానికి ఏం అనాలో అర్థం కావడం లేదన్నారు. నిజంగానే అన్ని అంశాలు కేసీఆర్ కు చెప్పి చేరిస్తే.. నీళ్ల వివాదం, ఏడు మండలాలు లాగేసుకోవడం ఇవన్నీ ఎందుకు ఉండేవి.? ఆనాడు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని.. కేంద్రంలో ఉన్న మీరే చట్టంలో పెడతారు. ఇవాళ మీరే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి చట్టాలను కేంద్రం చేతుల్లో పెడతారు.ఇంత సిగ్గుమాలిన పని ఏమైనా ఉందా..అని ప్రశ్నించారు సతీష్ రెడ్డి.

పదవులను కూడా పణంగా పెట్టి కొట్లాడి పదవులను సైతం వదిలేశారు. కానీ ఆనాడు నువ్వు ఎక్కడున్నవ్ రేవంత్ రెడ్డి.? చంద్రబాబు సంకలో కూర్చోని తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా.. నవరంద్రాలు మూసుకుని కూర్చున్నావని ఫైర్ అయ్యారు. ఇవాళ వచ్చి శుద్ధపూస మాటలు చెప్పినంత మాత్రానా నువ్వు గొప్పోడివైపోవు. రేవంత్ రెడ్డి మొదట భాష మార్చుకోవాలని సూచించారు. ఆయన ఉన్నది ముఖ్యమంత్రి పదవిలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. మీ మాటలను, మీ చేతలను అన్నింటిని ప్రజలను గమనిస్తున్నారని అన్నారు.

గొప్పవాళ్లను తిట్టినంత మాత్రానా గొప్పవాడివైపోతావని అనుకుంటున్నావేమో.. కానీ గాడిదకు రంగేసినంత మాత్రానా సింహంగా మారదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు సతీష్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం మీద శ్రద్ధ పెట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఒకటే పని నడుస్తోంది. తప్పు చేయడం దాన్ని గత ప్రభుత్వం మీదకు నెట్టివేస్తుందని ఆరోపించారు.
60 రోజుల కాంగ్రెస్ పాలన అంతా అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు, బూతులు తప్పా ఏమీ లేదు. ఇదే పద్ధతి కొనసాగితే నీ పరువే కాదు.. రాష్ట్రం పరువు పోతుంది. ఇకనైనా ముఖ్యమంత్రిగా మసులుకో.. వీధిరౌడి వేషాలు మానేయాలని రేవంత్‌ రెడ్డికి హితవు పలికారు సతీష్ రెడ్డి.

ఇది కూడా చదవండి: విషయం లేకనే విషం చిమ్ముతుండు.. రేవంత్ పై చెలరేగిన హరీష్ రావు

Latest News

More Articles