Friday, May 17, 2024

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆ జడ్జిలకు ఆహ్వానం

spot_img

నాలుగేళ్ల కిందట సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య రామ జన్మభూమి కేసుపై చారిత్రాత్మక అంతిమ తీర్పునిచ్చింది. ఇప్పుడా ఐదుగురు జడ్జిలకు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. జనవరి 22న అయోధ్యలో జరిగే ఈ వేడుకకు ఆ జడ్జిలను ప్రభుత్వ అతిథులుగా ఆహ్వానించారు.

మాజీ సీజేఐ రంజన్ గోగోయ్, మాజీ సీజేఐ ఎస్ఏ బోబ్డే, ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ 2019లో చారిత్రక తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.

జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరగనుండగా, జనవరి 16 నుంచే ఏడు రోజుల క్రతువులు నిర్వహిస్తున్నారు. రామ మందిరం ప్రారంభోత్సవానికి దాదాపు 7 వేల మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో రాజకీయనేతలు, సెలెబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, సాధువులు, ఇతర రంగాలకు చెందినవారు ఉన్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో 6 పబ్ లపై కేసులు

Latest News

More Articles