Friday, May 3, 2024

చిత్తు చిత్తు ఓటమి.. పాకిస్తాన్ ఘోర పరాభవం..!

spot_img

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు T20 మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0 తేడాతో పాకిస్థాన్ ఘోరంగా ఓటమి పాలైంది. కెప్టెన్ షాహీన్ అఫ్రిది టీమ్ క్రైస్ట్‌చర్చ్‌లో వరుసగా నాలుగో ఓటమి చవిచూసింది. శుక్రవారం ముగిసిన నాలుగో మ్యాచ్‌లోనూ పాక్‌ చిత్తుగా ఓడింది.ఈ తాజా మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ తీసుకుని 159 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ ముందుంచింది. అయితే న్యూజిలాండ్ టీమ్ ఈ లక్షాన్ని సునాయాసంగా 18.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ 4-0 ఆధిక్యం సాధించింది.

ఇక పాకిస్తాన్ టీమ్ ఘోరమైన ఫార్మ్ కొనసాగుతుంది. గత 14 అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాకిస్తాన్‌కు ఇది 12వ అపజయం కాగా.. వరుసగా 8వ ఓటమి కావడం గమనార్హం. ఈ నిరాశాజనకమైన ఓటమి తర్వాత కెప్టెన్ షహీన్ అఫ్రిది తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఆకట్టుకునే ఆరంభాన్ని అందించినప్పటికీ, మిడిల్ ఓవర్లలో పాకిస్థాన్ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమైంది.

“రిజ్వాన్ మాకు ప్రారంభాన్ని అందించిన విధానం చాలా బాగుంది. దురదృష్టవశాత్తు, మిడిల్ ఓవర్లలో మేము అవకాశాన్ని పొందలేకపోయాము” అని షాహీన్ అన్నాడు. ముఖ్యంగా రిజ్వాన్ ఆటతీరును పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 170 పరుగులతో ఆటను పాకిస్థాన్‌కు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని అతను అభిప్రాయపడ్డాడు.

Latest News

More Articles