Sunday, May 19, 2024

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. నీట మునిగిన నాగ్‎పూర్

spot_img

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో నాగ్‎పూర్ ఆగమాగమవుతోంది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై మోకాళ్ల లోతు వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు.. బాధితులను సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నారు. ఒకే రాత్రి 100 నుంచి 125 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు కావడంతో అంబఝరి సరస్సు పోటెత్తిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ విపిన్ ఇటాంకర్ తెలిపారు. వరదల్లో చిక్కుకున్న పలువురిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. నాగ్‎పూర్ ఎయిర్ పోర్టులో నిన్న రాత్రి నుంచి ఉదయం 5.30 గంటల వరకు 106 మిమీ వర్షాపాత నమోదు అయింది.

Read Also: మనిషికి పంది గుండెను అమర్చిన అమెరికా వైద్యులు

కాగా వర్షబీభత్సంపై డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుజాగ్రత్త చర్యగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

Latest News

More Articles