Saturday, May 18, 2024

లైంగిక దాడులకు చెక్.. రంగంలోకి షీ టీం సాహస్ ఆప్స్

spot_img

పని ప్రదేశాలలో మహిళలపైన జరిగే లైంగిక దాడులను అరికట్టడంతో పాటు లైంగిక దాడి జరిగినప్పుడు దైర్యంగా పోలీస్ లకు సమాచారం ఇవ్వడం కోసం తెలంగాణ పోలీస్ ఆద్వర్యంలోని షీ టీం సాహస్(SAHAS) అనే ఆప్ కి రూపకల్పన చేసింది. బేగంపేటలోని ఐ.టి.సి కాకతీయ హోటల్ లో సాహస్ ఆప్ ని హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీ, డిజిపి అంజనీ కుమార్, ఏ.డి.జి.పి. షికా గోయల్ విడుదల చేసారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇండియాలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారని, వారు పని చేసే ప్రదేశాలలో లైంగిక దాడికి గురైనప్పుడు అధైర్యపడకుండ సాహస్ ఆప్ ద్వారా పిర్యాదు చేయవచ్చని, బాధితులకు కావాల్సిన అన్ని సహాయసహకారాలు ఈ ఆప్ ద్వారా లభిస్తాయని తెలిపారు. ఇక మహిళలపైన లైంగిక దాడులు జరగకుండా ఉండేందుకు అవహగహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. సాహస్ కార్యక్రమానికి సహకారాలు అందించిన పలువురు వ్యక్తులను ఈ సందర్బంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు..

Latest News

More Articles