Sunday, May 19, 2024

కీసరగుట్టలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.!

spot_img

శివనామస్మరణలతో కీసరగుట్ట మారుమోగుతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేదపండితులు, భవనీ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభిచంారు. కీసరగట్ట బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసిందని ఆలయ చైర్మన్ తటాకం నాగలింగశర్మ వెల్లడించారు. అటు మహాశివరాత్రిని పుస్కరించుకుని టీఎస్ టీర్టీసీ గ్రేటర్ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 6 రోజుల పాటు 300 వందల ఆర్టీసీ జాతర స్పెషల్ బస్సులను నడుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. కీసరగుట్టలో కుషాయిగూడ ఆర్టీసీ డీపో ఆద్వర్యంలో ఆర్టీసీ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు కీసరగుట్ట నుంచి నగరంలోని పలు ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా సరిపడా ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని తెలిపారు. 8 నుంచి 10 వరకు సీబీఎస్, పటాన్ చెర్వు నుంచి ఏడుపాయల, బీరంగుట్ట జాతరకు ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: సిరియాలో ISIS ఉగ్రవాద దాడి,18 మంది మృతి, 50మంది కిడ్నాప్.!

Latest News

More Articles