Monday, May 6, 2024

ఈ బాలీవుడ్ నటులు శివభక్తుల..ఆ హీరోయిన్ ఇంట్లో శివలింగం ప్రతిష్టాపన.!

spot_img

మహాశివరాత్రి పండుగను మార్చి 8న దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ రోజున శివభక్తులు భక్తిశ్రద్ధలతో శివపూజ నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా దేశం మొత్తం శివభక్తితో మునిగిపోతుంది. బాలీవుడ్ సెలబ్రెటీలు శివభక్తులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతిఏటా ఈ నటుల ఇంట్లో శివరాత్రి ఘనంగా జరుగుతుంది. శివభక్తులుగా మారి ప్రత్యేక పూజలు చేసే బాలీవుడ్ స్టార్ నటులు ఎవరో చూద్దాం.

సారా అలీ ఖాన్ :
ఈ జాబితాలో మొదటి పేరు నటి సారా అలీ ఖాన్. ఆమె ఎప్పుడూ శివ భక్తిలో నిమగ్నమై ఉంటుంది. మహాదేవుని దర్శనం కోసం సారా తరచుగా మహాకాల్, కేదార్‌నాథ్‌లకు వెళ్లుతుంది. ఇటీవల సారా బాబా బర్ఫానీని దర్శించుకునేందుకు అమర్‌నాథ్‌కు వెళ్లింది.

కంగనా రనౌత్:
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా తరచుగా శివున్ని దర్శించుకుంటుంది. ఆమె శివభక్తురాలు. కంగానా తన ఇంట్లో పూజాగదిలో శివలింగాన్ని ప్రతిష్టించింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ షేర్ చేసింది. కంగనా తరచుగా శివుని దర్శనం కోసం ఉజ్జయినిలోని ఆదియోగి దేవాలయం లేదా మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శిస్తుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగను గొప్ప వైభవంగా జరుపుకుంటుంది.

మౌని రాయ్:
మౌని రాయ్ దాదాపు ప్రతి పోస్ట్‌లో ‘ఓం నమః శివాయ్’,మహాదేవ్ అని రాస్తుంది. ఆమె శివునికి గొప్ప భక్తురాలు. మౌనిరాయ్ తరచుగా ఆదియోగి ఆలయాన్ని సందర్శిస్తుంది.

రవీనా టాండన్:
శివ నటి రవీనా టాండన్ ‘కేదార్‌నాథ్ నుండి రామేశ్వరం’ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 12 పవిత్ర జ్యోతిర్లింగాలను నటి సందర్శిస్తుంది.

అజయ్ దేవగన్ :
అజయ్ దేవగన్ గొప్ప శివభక్తుడు. శివుని స్ఫూర్తితో ఆయన ‘శివాయ్’ సినిమా తీశారు. అంతేకాదు తన గుండె దగ్గర శివుని టాటూ కూడా వేయించుకున్నాడు. అజయ్ దేవగన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎప్పుడూ శివుడి చిత్రాలను షేర్ చేస్తూనే ఉంటాడు.

సంజయ్ దత్ :
గొప్ప శివ భక్తుడైన సంజయ్ దత్ పేరు కూడా ఈ జాబితాలోఉంది. శివుడిని పూజించడమే కాదు, తన చేతిపై శివుడి పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. ఈ పచ్చబొట్టు క్రింద సంస్కృతంలో ‘ఓం నమః శివయ్’ అని ఉంటుంది.

 

Latest News

More Articles