Friday, May 3, 2024

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పెరగనున్న రీఛార్జ్ ప్లాన్స్ ధరలు.!

spot_img

భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికం కంపెనీ అయిన భారతీ ఎయిర్ టెల్ యూజర్లకు షాకిచ్చేందుకు రెడీ అయ్యింది. త్వరలోనే టారిఫ్ ప్లాన్స్ పెంచనున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే భారత్ లో టెలికాం రేట్లు పెంచనున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్లాన్స్ పై ఎప్పుడు ధరలు పెంచుతారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఎప్పుడైన ఈ ధరలు పెంచే అవకాశం ఉందని మై స్మార్ట్ ప్రైస్ తన నివేదికలో పేర్కొంది.

రానున్న నెలల్లో ఒక్కో యూజర్‌పై సగటు ఆదాయాన్ని (ARPU) రూ.208 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంచడమే టెలికాం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 5G సర్వీస్ కవరేజీని పెంచేందుకు ఎయిర్ టెల్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. నిజానికి డిసెంబర్ 2021 నుంచి భారతీయ టెలికాం రంగంలో ధరలలో పెద్దగా మార్పులు లేవు. దేశంలో 5జీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రతి రెండు లేదా మూడు ఏండ్లలో టారిఫ్ లను పెంచే ప్రక్రియ మొదలైంది. అయితే జియో కూడా రీఛార్జ్ ప్లాన్స్ పెంచుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి కంపెనీ ప్లాన్ ధరలను పెంచితే, ఇతర కంపెనీలు కూడా ఆ తర్వాత ధరను పెంచుతాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనను కంపెనీలు వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: 48 ఏళ్ల వయసులో మూడోసారి తండ్రైన షోయబ్​ అక్తర్.!

Latest News

More Articles