Friday, May 17, 2024

మేడారం భక్తులకు షాక్..బస్సుల్లో కోళ్లు, గొర్రెలకు ఎంట్రీ లేదన్న టీఎస్ఆర్టీసీ..!!

spot_img

మేడారం వెళ్లే భక్తులకు బిగ్ షాకచ్చింది టీఎస్ఆర్టీసీ. మేడారం జాతరకు వెళ్లే బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలను తీసుకెళ్లరాదని ఆర్టీసీ  ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మూగజీవాలను తీసుకురాకుండా భక్తులు సహకరించాలని కోరారు. మేడారం జాతర నేపథ్యంలో సజ్జనార్ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. భక్తులు ఆర్టీసీ బస్సులను వినియోగించాలని కోరిన సజ్జనార్..జాతర నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 6వేలకు పైగా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.

మునుపెన్నడూ లేని విధంగా మహాలక్ష్మీ స్కీంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ ప్రయాణ సౌకర్యం కల్పించాలమని తెలిపారు. ట్రాఫిక్ ను ద్రుష్టిలో ఉంచుకుని మేడారంలో 15కిలోమీటర్ల మేర 48క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేడారం జాతరలో 15వేల మంది సిబ్బంది విధుల నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల సేవాభావంతో వ్యవహారించాలని సజ్జనార్ సూచించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు కోళ్లు, గొర్రెలు, మేకలను అమ్మవార్లకు మొక్కులుగా సమర్పిస్తున్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. 6 జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్

Latest News

More Articles