Saturday, May 18, 2024

గ్రేటర్ వాసులకు షాక్..రోజూ 2గంటలు పవర్ కట్..!!

spot_img

భాగ్యనగర వాసులకు శీతాకాలంలోనే కరెంట్ కోతలు తప్పడం లేవు. విద్యుత్ మరమ్మతుల పేరుతో అధికారికంగా రోజుకు రెండు గంటలు విధిస్తున్న కరెంటు కోతలపై నగర వాస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వేసవిలో నిరంతరం నాణ్యమైన కరెంటు సరఫరా కోసం అంటూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ రిలీజ్ చేసిన మరమ్మత్తుల ప్రణాళికపై గ్రేటర్ వాసులు ఫైర్ అవుతున్నారు.

కేసీఆర్ హయాంలో విద్యుత్ మరమ్మతులు చేపట్టినా ఇలాంటి పరిస్థితి ఏనాడూ లేదని, కాంగ్రెస్ సర్కార్ రాగానే కరెంటు కోతలు విధించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం జనవరి 12 నుంచి ఫిబ్రవరి 10 వరకు గ్రేటర్ లోని 9 సర్కిళ్ల పరిధిలో రెండు గంటల కరెంటు కోతలు ఉంటాయనడం సామాజిక మాద్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బుధవారం కరెంటు కోతలపై సోషల్ మీడియాలో పలువురు వినియోగదారులు పోస్టు చేస్తూ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎండీ ముషారప్ అలీని ట్యాగ్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరమ్మతులు చేస్తున్నట్లు ప్రాంతాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా విద్యుత్ అంతరాయం వాటిల్లుతున్నట్లు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: సూపర్ ఓవర్‌లో ..ఆఫ్ఘనిస్తాన్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్..!! 

 

Latest News

More Articles