Sunday, May 19, 2024

ప్రాగ్‌ యూనివర్సిటీలో కాల్పులు.. 15 మంది మృతి..!!

spot_img

ఐరోపా దేశమైన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లో గురువారం దుండగులు కాల్పులు జరిపారు. ప్రేగ్‌లోని చార్లెస్ యూనివర్శిటీలో ఓ సాయుధుడు జరిపిన దాడిలో 15 మంది మరణించినట్లు చెక్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.చెక్ రిపబ్లిక్ ఇంటీరియర్ మినిస్టర్ విట్ రాకుసన్ చెక్ పబ్లిక్ టెలివిజన్‌తో మాట్లాడుతూ దాడి చేసిన వ్యక్తిని పోలీసులు మట్టుబెట్టినట్లు వెల్లడించారు. ఇకపై ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని, అయితే ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని..వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీలోని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు భవనంలో ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా లేదా కోణంలో సోదాలు నిర్వహించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదే యూనివర్సిటికి చెందినవాడుగా గుర్తించారు. అయితే కాల్పులకు ఏ తీవ్రవాద సంస్థకు సంబంధం లేదని చెక్ రిపబ్లిక్ ఇంటీరియర్ మినిస్టర్ తెలిపారు. పోలీసుల విచారణకు సహాకరించాలనిస్థానికులకు ఆయన విజ్నప్తి చేశారు.

జన్ పలాచ్ స్క్వేర్ సమీపంలో కాల్పులు జరగడంతో పోలీసు అధికారులను మోహరించినట్లు చెక్ పోలీసులు తెలిపారు. సమాచారం ఇస్తూ, ప్రేగ్ మేయర్ బోహుస్లావ్ స్వోబోడా మాట్లాడుతూ, కూడలిలో ఉన్న చార్లెస్ విశ్వవిద్యాలయం యొక్క ఫిలాసఫీ ఫ్యాకల్టీ ఖాళీ చేయబడిందని, కూడలికి సీలు వేయబడిందని చెప్పారు.ఆ ప్రాంతమంతా చుట్టుముట్టినట్లు చెక్ పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆ పోస్ట్‌లో విజ్ఞప్తి చేశారు. పాలచ్ స్క్వేర్‌లోని కాన్సర్ట్ హాల్ అయిన రుడోల్ఫినమ్ గ్యాలరీ డైరెక్టర్ పీటర్ నెడోమా చెక్ టీవీతో మాట్లాడుతూ తాను షూటర్‌ని చూశానని చెప్పాడు. గ్యాలరీలో ఒక యువకుడిని చూశానని.. అతని చేతిలో ఆటోమేటిక్ ఆయుధం ఉందని దానితో కాల్పలు జరిపినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: మీ మెదడుకు పదును పెట్టే ఫుడ్స్ ఇవే..కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది..!!

Latest News

More Articles