Friday, May 17, 2024

 36 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

spot_img

ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో 36 రైళ్లను రద్దు చేసింది. ఈ విషయాన్ని రైల్వే అధికారులు తెలిపారు. రేపటి(ఆదివారం) నుంచి జులై 3 వరకు వీటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లను రేపు(ఆదివారం), ఎల్లుండి(సోమవారం). కాచిగూడ నుంచి రాయచూర్, మహబూబ్‌నగర్ వెళ్లే రైళ్లను ఇవాళ(శనివారం), 26(సోమవారం)న రద్దు చేశారు.

కరీంనగర్ నుంచి నిజామాబాద్, సిర్పూరు టౌన్ మధ్య నడిచే రైళ్లను ఎల్లుండి(సోమవారం) నుంచి జులై 3 వరకు రద్దు చేశారు. కాజీపేట నుంచి డోర్నకల్, భద్రాచలం-విజయవాడ, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్, వరంగల్ ప్యాసెంజర్ రైళ్లను ఈ నెల 26(సోమవారం) నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైల్వేకు సహకరించాలని కోరారు అధికారులు.

Latest News

More Articles