Monday, May 13, 2024

ఇంగ్లండ్‌పై శ్రీ‌లంక చారిత్రాత్మ‌క విజ‌యం..!!

spot_img

టీ20ల్లో శ్రీ‌లంక మ‌హిళ‌ల జ‌ట్టు ఇంగ్లండ్‌పై చారిత్రాత్మ‌క విజ‌యం సాధించింది. గత 14 ఏళ్లలో టీ20ల్లో ఇంగ్లండ్‌పై లంక మ‌హిళ‌ల జ‌ట్టు గెలవడం ఇదే తొలిసారి. తొలిసారిగా శ్రీ‌లంక, ఇంగ్లండ్ జ‌ట్లు 2009లో త‌ల‌ప‌డ్డాయి. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఇరుజ‌ట్లు 12సార్లు తలపడ్డాయి. ఇందులో 10సార్లు ఇంగ్లండ్ విజయం సాధించ‌గా.. రెండు మ్యాచుల్లో ఫ‌లితం రాకుండానే ముగిసాయి.

MLC Kavitha సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి

ఈరోజు జ‌రిగిన రెండో టీ20లో లంక కెప్టెన్ చ‌మ‌రి అట‌ప‌ట్టు 55 ( 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో 8 వికెట్ల తేడాతో లంక‌ చిర్మ‌స్మ‌ణీయ విజ‌యం సాధించింది. దీనితోపాటు మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో స‌మం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 103 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ఆ తర్వాత స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని మ‌రో ఆరు ఓవ‌ర్లు ఉండ‌గానే శ్రీ‌లంక ఛేదించింది. సిరీస్ విజేత‌ను నిర్ణ‌యించే మూడో టీ20 సెప్టెంబ‌ర్ 6న‌ జ‌రుగ‌నుంది.

Latest News

More Articles