Monday, May 6, 2024

విషాదం.. కూతురు పెండ్లిలో గుండెపోటుతో తండ్రి మృతి

spot_img

కరీంనగర్ జిల్లా : కూతురికి పెండ్లిచేసి అత్తారింటికి పంపిస్తున్న ఆనందంతో ఆ తండ్రి మురిసిపోయాడు. పెండ్లి ఇళ్లంతా బంధువులు, స్నేహితులతో సందడిగా ఉంది. మరికొన్ని గంటల్లో కూతురు పెళ్లి అనగా.. అంతలోనే విషాదం చోటుచేసుకున్నది.

Chandramukhi 2 భయపెడుతున్న ‘చంద్రముఖి-2’ ట్రైలర్..!!

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లిలో విషాదకర ఘటన జరిగింది. కూతురు పెండ్లి నాడే తండ్రి రాములు గుండెపోటుతో మృతి చెందాడు. మరికొన్ని గంటల్లో పెండ్లి అనగా..  అతను గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు రాములును  ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. తండ్రి మరణంతో పెళ్లి నిలిచిపోయింది. ఇప్పలపల్లిలో విషాదం నెలకొంది.

Latest News

More Articles