Sunday, May 12, 2024

విజయ్‌ సినిమా నుంచి తప్పుకున్న శ్రీలీల

spot_img

హైదరాబాద్:  బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో యమ బిజీగా ఉన్న శ్రీలీల.. తాజాగా విజయ్‌ దేవరకొండ-గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమా నుంచి ఈ బ్యూటీ తప్పుకున్నట్లు సమాచారం. డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయడం ఇబ్బందిగా మారడంతో సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

Also Read.. ఆసీస్ బౌలర్లను చిత్తు చేసిన ఇండియా..ఆస్ట్రేలియా టార్గెట్-400

నటనతో పాటు డ్యాన్స్ లతో అదరగొడుతున్న శ్రీలీల యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు అరడజనుకు పైగానే సినిమాలున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ల సినిమాలు ఉన్నాయి. పెళ్లి సందD, ధమాకా సినిమాలతో శ్రీలీల సినీ గ్రాఫ్ అమాంతం పెరిగింది.  ప్రస్తుతం ఈ బ్యూటీ గుంటూరు కారంతో పాటు ఉస్తాద్ భగత్‌సింగ్‌, స్కంద, భగవంత్‌ కేసరి, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌, ఆది కేశవ వంటి సినిమాలలో నటిస్తోంది.

మరిన్ని వార్తలు చదవండి:

Latest News

More Articles