Saturday, May 18, 2024

బ్రాడ్‌మన్ రికార్డును బ్రేక్ చేసిన స్టీవ్ స్మిత్‌

spot_img

దక్షిణాఫ్రికాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ 104 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో తన సెంచరీల సంఖ్యను 30కి పెంచుకున్నాడు. దీంతో ప్రపంచ క్రికెట్ దిగ్గజం బ్రాడ్ మన్ ను స్మిత్ అధిగమించాడు. బ్రాడ్ మన్ తన కెరీర్ లో 29 సెంచరీలను సాధించాడు. ఆ రికార్డును స్టీవ్ స్మిత్ అధిగమించాడు. దీంతో బ్రాడ్‌మన్ రికార్డును దాటేసిన మూడ‌వ ఆసీస్ బ్యాట‌ర్‌గా స్మిత్ చరిత్ర సృష్టించాడు.

ఆస్ట్రేలియా తరపున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన జాబితాలో రికీ పాంటింగ్ (41 సెంచరీలు) తొలి స్థానంలో ఉన్నాడు. 32 సెంచరీలతో స్టీవ్ వా, 30 శతకాలతో స్టీవ్ స్మిత్, మాథ్యూ హేడెన్ లు మూడో స్థానంలో ఉన్నారు. రికీ పాంటింగ్ రికార్డును బద్దలుకొట్టే అవకాశం స్టీవ్ స్మిత్ కు ఉంది.

Latest News

More Articles