Friday, May 3, 2024

దుబాయ్ ని వణికించిన భారీ వర్షం..!

spot_img

ఎడారి దేశం దుబాయ్ ను భారీ వర్షాలు వణికించాయి. అకాల వర్షాలు బీభత్సం స్రుష్టించాయి. మంగళవారం బలమైన గాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు నదులను తలపించాయి. జనజీవనం స్తంభించిపోయింది. దుబాయ్ లో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం..కేవలం గంటల్లోనే కురిసిందని అధికారులు తెలిపారు.

సోమవారం అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి దుబాయ్ లోని అనేకు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. వరదధాటికి ప్రధాన రహదారిలో కొంత భాగం కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ నగరంలో 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రన్ వేపైకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే ఉండాల్సి వచ్చింది. రన్ వేపై మోకాలిలోతు నీటిలో విమానాలు ఉన్న ద్రుశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎమిరేట్ ఆఫ్ ఫుజైరా..నీరులేని పర్వత ప్రాంతాలు, రాతినేలలు, మైదాన ప్రాంతాల మిశ్రమంతో ఉండే ఈ ప్రాంతం రాతి ఏడారికి చాలా ఫేమస్. అలాంటి ప్రాంతంలో మంగళవారం 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా గతంలో యూఏఈలో ఈ స్థాయి వర్షాలు చాలా అరుదుగా కురుస్తుంటాయి. అలాంటిది గత రెండు మూడు ఏండ్లలో తరుచుగా కుండపోత వర్షం కురుస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావంతోనే ఈ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి : గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

Latest News

More Articles