Wednesday, May 1, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

spot_img

కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులై క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుండి జీత భత్యాలు పొందుతున్న దాదాపు 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది స్పష్టం చేస్తూ భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి కమిషన్కు అనేక ఫిర్యాదులు అందాయని, నిర్దేశిత పనికి బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్లు ఈసీ గుర్తించింది.

ఈ నేపథ్యంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఈసీ గుర్తించింది. దీంతో మంత్రికి వర్తించే విధంగా ఈ సలహాదారులకు కూడా ఎన్నికల ప్రవర్తనా నియామవళి వర్తిస్తుందని చెప్పింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘించినా చర్యలు తీవ్రంగా ఉంటాయన్ని హెచ్చరించింది. సంబంధిత చట్టాలకు లోబడి కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది.

ఇక ఏప్రిల్ 19 శుక్రవారం నుంచి ఏడు దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల కమిషన్. ఆరుణాచల్ ప్రదేశ్, ఏపీ, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 13వ తేదీన ఏపీలో లోకసభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు.

ఇది కూడా చదవండి: మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

Latest News

More Articles