Sunday, May 19, 2024

ఓటుకు నోటు దోంగ సీఎం అయితే ఇలానే ఉంటుంది.. మండిపడుతున్న విద్యార్థులు

spot_img

హైదరాబాద్: రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నది. అడ్మిన్ బ్లాక్ నుంచి వీసీ ఛాంబర్ వరకు ర్యాలీ నిర్వహించి.. వీసీ ఛాంబర్ ముట్టడించారు విద్యార్థులు. యూనివర్సిటీ భూములు కాపాడాలని ఆందోళన చేపట్టారు. వీసీ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఝాన్సీని ఈడ్చిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Also Read.. మైనంపల్లి హనుమంత రావుపై చర్యలు తీసుకోండి: లోకాయుక్త

ఓటుకు నోటు దోంగ సీఎం అయితే ఇలానే ఉంటుంది అంటూ విద్యార్థులు మండిపడ్డారు. రియల్ మాఫియా కోసమే యూనివర్సిటీ భూమిలో హైకోర్టు నిర్మాణం చేపడుతున్నారంటూ ఆరోపించారు. జీవో 55ను రద్దు చేయకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రజా పాలన అంటే ఇదేనా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు విద్యార్థులు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు మళ్ళీ మొదలయ్యాయని విద్యార్థులు అన్నారు. వీసీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Latest News

More Articles