Sunday, May 19, 2024

కాంగ్రెస్ తీరుకు నిరసనగా జయశంకర్ యూనివర్సిటీకి తాళం వేసిన విద్యార్థులు

spot_img

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి ఇవ్వవద్దని కోరుతూ విద్యార్థులు నిరసన చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం అగ్రికల్చర్ యూనివర్సిటీ బంద్‎కు పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయం పరిపాలన భవనంతో పాటు వివిధ విభాగాలకు విద్యార్థులు తాళాలు వేశారు. కళాశాలలోకి అధికారులను, శాస్త్రవేత్తలను అధ్యాపకులను వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఈ రోజు పరీక్ష రాయడానికి వస్తున్న రెండో సంవత్సరం విద్యార్థులను కూడా అడ్డుకుంటున్నారు. దాంతో యూనివర్సిటీ అధికారులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. జీవో నెంబర్ 55ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసేంతవరకు పరీక్షలు రాసే ప్రసక్తేలేదని హెచ్చరిస్తున్నారు. దాంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది.

Read Also: మేకను తింటున్న చిరుత.. గొర్రెల కాపరి సెల్‎ఫోన్‎కు చిక్కిన వీడియో

కాగా.. అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనకు బీఆర్ఎస్వీ మద్దతు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ ధర్నాకు దిగారు. యూనివర్సిటీ భూముల్లో హైకోర్ట్ నిర్మాణాలు వద్దని, జీవో నెంబర్ 55ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Latest News

More Articles