Saturday, May 18, 2024

డాక్టర్ రెడ్డీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్‌

spot_img

ప్రముఖ అంతర్జాతీయ ఔషధ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్.. తమ టెన్షన్ మత్‎లో (ఒత్తిడి తీసుకోవద్దు) కార్యక్రమ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్‌ని ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించింది. హైపర్‌టెన్షన్, దాని లక్షణాలు, కారణాల గురించి అవగాహన పెంచడం మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం రక్తపోటును సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని సూచించడం ఈ ప్రచారం లక్ష్యంగా చేసుకుంది. హైపర్‌టెన్షన్ మేనేజ్‌మెంట్‌లో దాని మూడు దశాబ్దాల నైపుణ్యాన్ని ఉపయోగించుకుని, రక్తపోటు నియంత్రణకు సంబంధించిన అభిప్రాయాన్ని మార్చడానికి డాక్టర్ రెడ్డీస్ ముందుకొచ్చింది. ప్రస్తుతం రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు మరియు ప్రమాదంలో ఉన్నవారికి ఇది ప్రయోజనం చేకూర్చనుంది.

దేశంలో దాదాపు 75% కంటే ఎక్కువ మంది రక్తపోటును కలిగి ఉన్నారు. అయితే వారిలో చాలామందికి రక్తపోటు పెరుగుదల గురించి తెలియదు. కాగా… దేశంలోని 220 మిలియన్లకు పైగా ప్రజలకు చికిత్స సేవలను వేగంగా అందించేందుకు భారత ప్రభుత్వం ఇండియన్ హైపర్‌టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ (IHCI)ని ప్రారంభించింది. భారతదేశంలో రక్తపోటు ఉన్నవారిలో కేవలం 12% మంది మాత్రమే రక్తపోటు నియంత్రణ కలిగి ఉన్నారు. గుండెపోటు మరియు స్ట్రోక్ వంటి కార్డియోవాస్కులర్ వ్యాధులకు రక్తపోటు ప్రధాన ప్రమాదకారిగా నిలుస్తుంది. దేశంలోని మొత్తం మరణాలలో మూడింట ఒక వంతుకు ఇదే కారణమవుతోంది. 2025 నాటికి హైపర్‌టెన్షన్ ప్రాబల్యాన్ని 25% వరకూ తగ్గించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది.

డా. రెడ్డీస్ వారి టెన్షన్ మత్ లో కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‎గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని గవాస్కర్ అన్నారు. ‘మెరుగైన ఆరోగ్యం కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఒక క్రీడాకారుడిగా నాకు బాగా తెలుసు. రక్తపోటు అనేక సమస్యలకు కారణమవుతుంది’ అని బ్రాండ్ అంబాసిడర్ సునీల్ గవాస్కర్ అన్నారు.

డాక్టర్ రెడ్డీస్ సీఈఓ ఎం.వి. రమణ మాట్లాడుతూ ‘హైపర్‌టెన్షన్ మీద మా సంస్థ దృష్టి సారించింది. దాదాపు 30 సంవత్సరాలకు పైగా మా పోర్ట్‌ఫోలియో ద్వారా ఈ విభాగంలోని రోగులకు సేవ చేస్తున్నాం. భారతదేశంలో హైపర్‌టెన్షన్ కేసులు మరియు దానిని నియంత్రించాల్సిన అవసరంపై బలమైన సందేశాలను పంపడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని ఆయన అన్నారు.

Latest News

More Articles