Sunday, May 19, 2024

మూడు ఫార్మాట్లలోనూ టీంఇండియాదే నెంబర్ వన్ ప్లేస్

spot_img

భారత క్రికెట్‌ చరిత్రలో అరుదైన సందర్భం చోటు చేసుకుంది. టీమ్‌ఇండియా అన్ని ఫార్మాట్లలో నంబర్‌వన్‌ జట్టుగా నిలిచింది. ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లలో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్న రోహిత్‌సేన.. తాజాగా వన్డేల్లో కూడా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించడం ద్వారా ఈ ఘనతను సాధించింది. 115 పాయింట్లతో మొదటిస్థానంలో ఉన్న దాయాది పాకిస్థాన్‌‎ను దాటేసి.. 116 పాయింట్లతో టీంఇండియా నంబర్‌వన్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది.

Read Also: వినాయకుడి దీపం పోకుండా అడ్డుగా దుప్పట్లు.. గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం

ఇక పర్‎ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఐసీసీ వన్డే బౌలింగ్‎లో హైదరాబాద్ కుర్రాడు సిరాజ్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. టీ20 బ్యాటింగ్‎లో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ వన్ ర్యాంక్‎లో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్ రౌండర్‎గా రవీంద్ర జడేజా… టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్‎గా అశ్విన్, వన్డే బ్యాటింగ్‎లో సెకండ్ ప్లేస్‎లో శుబ్ మన్ గిల్ కొనసాగుతున్నారు.

Read Also: ఆస్ట్రేలియాపై విజృంభించిన కుర్రాళ్లు.. తొలి వన్డే ఇండియాదే

Latest News

More Articles