Tuesday, May 7, 2024

తెలంగాణ ఆస్పత్రుల సత్తా.. ఏడు పల్లె దవాఖానాలకు జాతీయస్థాయి గుర్తింపు

spot_img

ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసిన మన పల్లె దవాఖానాలు అరుదైన రికార్డు సాధించాయి. నాణ్యతా ప్రమాణాలు, రోగులకు మెరుగైన వైద్య సేవలు, మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణ విభాగాల్లో ఏడు పల్లె దవాఖానాలకు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంట, జగిత్యాల జిల్లాలోని ధరూర్‌, ఖమ్మం జిల్లా దంసులాపురం, ఆదిలాబాద్ జిల్లా ధనోరా, సూర్యాపేట జిల్లా రామారం, భూపాలపల్లి జిల్లా జంగేడు, నల్లగొండ జిల్లా ముషంపల్లిలకు ఈ ఘనత లభించింది. గత నెల 17న ఇక్కడ పర్యటించిన జాతీయ వైద్య బృందాలు, ఈ మూడు దవాఖానల్లో సేవలపై ప్రశంసలు కురిపించగా, తాజాగా నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్స్‌(ఎన్‌క్వాస్‌) సర్టిఫికెట్‌కు ఎంపిక చేశాయి. ఈ గుర్తింపుతో మూడేళ్ల పాటు నిధులు రానుండగా, వైద్యాధికారులు, సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తింపుకు సంబంధించిన ప్రశంసను ఈ నెల 11న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసింది. అందులో జమ్మికుంట దవాఖాన 90శాతం స్కోరుతో టాప్‌లో నిలిచింది.

Read Also: మూడు ఫార్మాట్లలోనూ టీంఇండియాదే నెంబర్ వన్ ప్లేస్

సర్కారు వైద్యానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేశారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగం ప్రజలకు చేరువైంది. ఎన్నడూలేనంతగా బలోపేతమైంది. పైసా ఖర్చు లేకుండా కార్పోరేట్‌కు దీటుగా ప్రజలకు అన్ని రకాల నాణ్యమైన ఉచిత వైద్య సేవలందుతున్నాయి. ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పల్లె దవాఖాన, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు.

Read Also: వినాయకుడి దీపం పోకుండా అడ్డుగా దుప్పట్లు.. గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం

Latest News

More Articles