Saturday, May 18, 2024

హైదరాబాద్ లో “టెక్నిప్‌ ఎఫ్‌ఎంసి”  రూ.1250 కోట్ల పెట్టుబడి

spot_img

హైదరాబాద్: సాంప్రదాయ, పునరుత్పాదక ఇంధన రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన ఫ్రెంచ్-అమెరికన్ ఆయిల్-గ్యాస్ దిగ్గజ కంపెనీ “టెక్నిప్‌ ఎఫ్‌ఎంసి” (TechnipFMC)  గ్లోబల్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావుతో  “టెక్నిప్‌ ఎఫ్‌ఎంసి” (TechnipFMC) కంపెనీ ఉన్నతాధికారుల బృందం సమావేశమైంది. హ్యూస్టన్ లోని “టెక్నిప్‌ ఎఫ్‌ఎంసి” క్యాంపస్ లో కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రస్ డాల్, ఇండియా హెడ్-మేనేజింగ్ డైరెక్టర్ హౌసిలా తివారీ  తో పాటు ఇతర అధికారులు కేటీఆర్ ను కలిశారు.

తన సాఫ్ట్‌వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ తో పాటు ప్రెసిషన్ ఇంజనీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని హైదరాబాద్ లో ప్రారంభించడానికి ఈ సమావేశంలో “టెక్నిప్‌ ఎఫ్‌ఎంసి” నిర్ణయం తీసుకుంది. 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. ఇంతేకాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుచేయబోయే మరో మ్యానుఫాక్చరింగ్ సెంటర్ ను కూడా ఏర్పాటుచేయడానికి హైదరాబాద్ నే  ఆ కంపెనీ ఎంచుకుంది. అదనంగా ఏర్పటుచేయబోయే ఈ కేంద్రంతో రాబోయే 5 ఏళ్లలో 1000 ఉద్యోగాలను కంపెనీ కల్పించబోతుంది. తొలి దశలో 1250 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతుంది. 5400 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులను హైదరాబాద్ కేంద్రంగా చేయబోతుంది.

FMC టెక్నాలజీస్ మరియు టెక్నిప్‌ల విలీనంతో ఏర్పడిన  “టెక్నిప్‌ ఎఫ్‌ఎంసి” (TechnipFMC) సంస్థ ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో దాదాపు 30,000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విద్యుత్ ప్రాజెక్టులు,టెక్నాలజీ, సిస్టం, సర్వీసెస్ రంగంలో “టెక్నిప్‌ ఎఫ్‌ఎంసి” (TechnipFMC) కి అంతర్జాతీయంగా మంచి పేరుంది.  గ్రీన్‌హౌస్ గ్యాస్ తొలగింపు, పునరుత్పాదక ఇంధన తయారీ, హైడ్రోజన్ ఆధారిత ఇంధన ఉత్పత్తి ఆవిష్కరణల్లో  ముందంజలో ఉంది.

ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పెట్టుబడులు & NRI వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ విష్ణు వర్ధన్ రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి ఆత్మకూరి, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ PA పాల్గొన్నారు.

Latest News

More Articles