Friday, May 17, 2024

రాజేంద్ర‌న‌గ‌ర్‌లో ఉద్రిక్త‌త

spot_img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో మంద‌కొడిగా ప్రారంభ‌మైన పోలింగ్ క్ర‌మంగా ఊపందుకోనుంది. ఇక ఓట‌మి భ‌యంతో కాంగ్రెస్ నేత‌లు, కార్య‌కర్త‌లు పోలింగ్ కేంద్రాల వద్ద దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. న‌ర్సాపూర్‌, జ‌న‌గాం స‌హా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఘ‌ర్ష‌ణ‌ల‌తో ఉద్రిక్త‌త నెల‌కొంది.

ఇక రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయారు. పోలింగ్ కేంద్రం స‌మీపంలో టేబుల్‌, కుర్చీలు ప‌డేసి దుర్భాష‌లాడుతూ బీఆర్ఎస్ కార్య‌కర్త‌ల‌పై కాంగ్రెస్ శ్రేణులు దాడికి య‌త్నించ‌డంతో క‌ల‌క‌లం రేగింది. మ‌ణికొండ‌లోనూ బీఆర్ఎస్‌, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కూ రాష్ట్ర వ్యాప్తంగా 20.64 శాతం పోలింగ్ న‌మోదైంది. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెర‌గాల‌ని సీఈవో వికాస్ రాజ్ పేర్కొన్నారు.పోలింగ్ సంద‌ర్భంగా దాడుల‌పై ఫిర్యాదులు అందాయ‌ని చెప్పారు.

Latest News

More Articles