Friday, May 17, 2024

సీటు రానందుకు ఖుషి అయితున్న తెలంగాణ బీజేపీ నేతలు

spot_img

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయంగా వేడెక్కింది. పార్టీలన్నీ తమతమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్.. తమ అభ్యర్థుల్ని ప్రకటించి.. రాకెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కూడా తన ప్రచారంలో వేగం పెంచారు. నియోజకవర్గాల వారీగా తిరుగుతూ.. క్యాడర్‎లో జోష్ పెంచుతున్నారు. ఈ తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించడంలోనే తలమునకలైతున్నాయి.

Read Also: ఎన్నికల క్షేత్రంలో భర్తకు పోటీగా భార్య..

తాజాగా బీజేపీ తమ అభ్యర్థుల మొదటి లిస్టును విడుదల చేసింది. ఆ లిస్ట్ వచ్చినప్పటి నుంచి తమకు టికెట్‌ రాలేదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఉనికిలో లేని సమయంలో సొంత ఖర్చుతో పార్టీని నిలబెట్టామని, తీరా టికెట్ల కేటాయింపులో అన్యాయం చేశారని కొన్ని నియోజకవర్గాల నేతలు ఆవేదన చెందుతున్నారు. ఇతరులకు, వేరే పార్టీల నుంచి వచ్చినవారికి టికెట్లు కేటాయించారని మండిపడుతున్నారు. తాజాగా సిరిసిల్లకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి రమాకాంత్‌రావు రాజీనామా చేశారు. పార్టీలో కార్యకర్తల త్యాగాలకు గుర్తింపు లేదని, నియంతృత్వం పెరిగిపోయిందని ఆరోపించారు.

మరికొందరు మాత్రం టికెట్‌ రాకపోవుడే మంచిగైందని మురిసిపోతున్నారు. బీజేపీ టికెట్‌ రాకపోవడంతో పైసలు మిగిలాయని పలువురు నేతలు తమ సన్నిహితుల వద్ద ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. గత రెండు దఫాల్లో పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేశామని, ఎన్నికల ఖర్చు తప్ప డిపాజిట్‌ కూడా రాలేదని తమ అనుభవాలను నెమరేసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే టికెట్లు పొందిన కొందరు అభ్యర్థులు మాత్రం తమకు బదులుగా వేరే వాళ్లను చూసుకోవాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా అభ్యర్థుల విషయంలోనే మల్లగుల్లాలు పడుతున్న బీజేపీ.. బీఆర్ఎస్‎కు పోటీనా అని రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.

Latest News

More Articles