Sunday, May 19, 2024

ఎన్నికల్లో డబ్బే డబ్బు.. 11 రోజుల్లో రూ. 243 కోట్ల సొత్తు స్వాధీనం

spot_img

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రం మొత్తం రాజకీయంగా హీటెక్కింది. ఆయా పార్టీలు తమ ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. కాగా.. ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.

Read Also: వాట్సాప్‎లో మరో కొత్త ఫీచర్.. త్వరలోనే అందుబాటులోకి..

గురువారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో రూ.78 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్‌ చేశారు. గురువారం రూ.10.13 కోట్ల నగదు దొరకగా, 19వ తేదీ వరకు రూ.88 కోట్ల నగదు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. 19న రూ.1.21 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగదు, మద్యం కాకుండా.. రూ.120.40 కోట్ల ఆభరణాలు, వజ్రాలు పట్టుబడినట్లు తేలింది. ఇవే కాకుండా.. ఓటర్లకు పంచే రైస్‌కుక్కర్లు, ల్యాప్‌టాప్‌లు, చీరలు, క్రీడా సామగ్రి, బియ్యం వంటి రూ.17,48,81,471 విలువైన వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో 11 రోజుల్లోనే రూ.243,76,19,296 విలువైన సొత్తు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: పిల్లలు పుట్టకుండా ఇంజెక్షన్.. త్వరలోనే మార్కెట్లోకి

Latest News

More Articles