Saturday, May 18, 2024

తెలంగాణలో సమ్మెలు నిషేధం.. రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం

spot_img

చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి పనికిమాలిన పనులు అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు లేదా అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెగ గొంతు చించుకున్న ఈయన ఇప్పుడు తెలంగాణలో సమ్మెలు నిషేదించారు. విద్యుత్ ఉద్యోగులకు షాక్ ఇస్తూ.. ట్రాన్స్ కో తో పాటు.. తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్), దక్షిణ మండల విద్యుత్ పంపినీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో సమ్మెలు నిషేధిస్తూ జీవో విడుదల చేసింది. దీంతో సర్కారు నిర్ణయంపై ట్రాన్స్ కో, డిస్కంల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇక ఫిబ్రవరి 25 నుంచి ఆరు నెలలపాటు సంస్థల్లో సమ్మెలు నిషేధిస్తున్నట్టు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఉత్వర్వులను ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలుంటాయని కూడా హెచ్చరించింది. అయితే మొన్నటివరకు ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు చేప్పట్టడానికి అనుమతులు లేవు, నిరంకుశ ప్రభుత్వం, అదీఇదీ అని నోటికొచ్చిన తిట్లు తిట్టినా రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఎప్పటిలాగే మాట మార్చేశాడు. రైతుబంధు, రైతుభరోసా, పెన్షన్స్, రుణమాఫీ వంటి పథకాలని ఎలాగైతే ఆపేశాడో ఇప్పుడు తెలంగాణలో సమ్మెలు నిషేధం ప్రకటించి తనలోని నిరంకుశత్వాన్ని ప్రదర్శించాడు రేవంత్ రెడ్డి.

Latest News

More Articles