Friday, May 17, 2024

నర్సుల గౌరవం పెంచిన తెలంగాణ ప్రభుత్వం.. ఇక నుంచి వారందరూ..

spot_img

ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తమ గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి పేరును ఉన్నతీకరించాలని నర్సులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వివిధ హోదాల్లో పేర్లు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Read Also: కానిస్టేబుల్ కొలువుల జాతర.. ఒక్కో ఇంట్లో ముగ్గురు, నలుగురికి జాబ్స్

దీని ప్రకారం ఇకనుండి స్టాఫ్ నర్స్‎ని నర్సింగ్ ఆఫీసర్‎గా, హెడ్ నర్స్‎ని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‎గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2ను డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్‎గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ వన్‎ను చీఫ్ నర్సింగ్ ఆఫీసర్‎గా మార్చడం జరిగింది. వైద్యారోగ్య శాఖతో పాటు, ఇతర శాఖల్లో విధులు నిర్వర్తించే నర్సింగ్ సిబ్బందికి ఇది వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొంది.

పబ్లిక్ హెల్త్ సైడ్ ఆసుపత్రుల్లో పని చేసే పబ్లిక్ హెల్త్ నర్స్ పోస్టును పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్‎గా, డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టును యధాతధంగా ఉంచటం జరిగింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ నర్సింగ్ సిబ్బందికి మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, వారి గౌరవాన్ని మరింత పెంచేలా పోస్టుల పేర్లు ఉన్నతీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నదన్నారు. ప్రేమ, ఆప్యాయతతో కూడిన వైద్య సేవలు ప్రజలకు అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందించాలని ఆయన సూచించారు.

Latest News

More Articles