Friday, May 17, 2024

సిక్కిం వరదల గురించి ముందే తెలుసా? ఆ హెచ్చరికలను పట్టించుకోలేదా?

spot_img

ఈశాన్యరాష్ట్రం సిక్కింలో ఆకస్మిక వరదలు భారీ విధ్వాంసాన్ని స్రుష్టించాయి. ఈ వరదల్లో వందలాది గల్లంతయ్యారు. 14 మంది మరణించారు. 22 మంది సైనిక సిబ్బంది సహా 102 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అయితే సిక్కిం వరదల గురించే ముందే తెలుసా? అయినా అక్కడి యంత్రాంగం పట్టించుకోలేదా? అంటే అవుననే చెబుతోంది జియోమోర్ఫాలజీ జర్నల్‌. 2021లో జియోమోర్ఫాలజీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం హిమానీనదం వల్ల లోనాక్ సరస్సు ఉప్పొంగి ప్రవహిస్తుందని…ఏ క్షణమైనా ఆకస్మిక వరదలు తప్పవని హెచ్చరించింది. సిక్కింలోని గ్లేసియర్ సరస్సు సౌత్ లొనాక్ భవిష్యత్తులో ఎప్పుడైనా విధ్వంసం స్రుష్టిందని దీని వల్ల చాలా నష్టం వాటిల్లవచ్చని అంతర్జాతీయ బృందం తన అధ్యయనంలో రెండేళ్ల క్రితం హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: సిక్కింలో క్లౌడ్‌బర్స్ట్..81 మంది సైనికులు గల్లంతు..10 మంది మృతి..!!

జియోమార్ఫాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన 2021 అధ్యయనం హైలైట్ చేసింది, హిమానీనదం తిరోగమనం కారణంగా దక్షిణ లోనాక్ సరస్సు గత దశాబ్దాలుగా దాని విస్తీర్ణం పెరిగిందని.. హిమానీనదం సరస్సు ఉప్పెన వరదలకు (GLOFs) సంభావ్యత పెరిగిందని పేర్కొంది. కరిగిపోయే హిమానీనదాల ద్వారా ఏర్పడిన సరస్సులకు అకస్మాత్తుగా వరదలు వచ్చి ఉప్పొంగున్నాయని, GLOFలు ఏర్పడతాయని తెలిపింది. సరస్సులో ఎక్కువ నీరు చేరడం వంటి అనేక కారణాల వల్ల ఇది జరుగుతుందని వివరించింది. 1962 నుండి 2008 వరకు 46 సంవత్సరాలలో హిమానీనదం దాదాపు రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిందని అధ్యయనాలు చెబుతున్నాయి. 2008 నుంచి 2019 మధ్య కాలంలోనే దాదాపు 400 మీటర్ల మేర వెనక్కి వెళ్లినట్లు పేర్కొంది.

సిక్కింలోని నార్త్ లొనాక్ సరస్సులో మేఘాలు పేలడం, తీస్తా వరద యొక్క భయంకరమైన ప్రభావాన్ని చూపింది. సిక్కింలో 19 మృతదేహాలు, తీస్తా నది నుంచి బెంగాల్‌లోని వివిధ జిల్లాల్లో 23 మృతదేహాలు లభ్యమయ్యాయి. 22 మంది ఆర్మీ సిబ్బంది సహా 109 మందికి పైగా గల్లంతయ్యారు. తప్పిపోయిన 22 మంది సైనికులలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి, అయితే దీనిని సైన్యం ధృవీకరించలేదు. వరదలు, వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్ల నుండి ఇప్పటివరకు 2011 మందిని సురక్షితంగా తరలించారు. సిక్కింలోని 22000 మంది ప్రజలు ఈ విపత్తుతో ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. నాలుగు జిల్లాల్లోని 26 శిబిరాల్లో మొత్తం 3822 మందిని ఉంచారు. గురువారం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. అన్ని విధాలా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతో సంభాషించినట్లు వెల్లడించారు. సాయం విషయమై ప్రధానికి లేఖ కూడా రాశానని చెప్పారు.

ఇది కూడా చదవండి: మీ చేతివేళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే మీరు స్మార్ట్‌ఫోన్‌ను వదిలేయాల్సిన సమయం వచ్చినట్లే..!!

కాగా తీస్తా ఉప్పెన కారణంగా సిక్కింలోని 11 వంతెనలు విరిగి బుధవారం కొట్టుకుపోయాయి. మంగన్ జిల్లాలో ఎనిమిది, నామ్చిలో రెండు, గ్యాంగ్‌టక్‌లో ఒక వంతెన కొట్టుకుపోయాయి. ఈ జిల్లాల్లో నదీ తీరాల వెంబడి ఉన్న పట్టణాలు, నగరాల్లో నీటి సరఫరా పైపులైన్లు, మురుగునీటి లైన్లు తెగి ధ్వంసమయ్యాయి. చుంగ్‌తంగ్‌లో అత్యధిక నష్టం సంభవించింది. నగరంలో 80 శాతం దెబ్బతిన్నది.

Latest News

More Articles