Saturday, May 4, 2024

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

spot_img

హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగిస్తుందని కేఆర్ఎంబీ ఛైర్మన్ కు ఈఎన్సీ మురళీధర్ రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించి మరీ పనులు కొనసాగిస్తున్నారని బోర్డు దృష్టికి తీసుకుపోయారు.

Also Read.. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి

ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ కొనసాగిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది.  తక్షణమే ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి వాస్తవాలను తెలుసుకొని పనులు ఆపివేసెలా చూడాలని బోర్డును తెలంగాణ కోరింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర జలసంఘం సంయుక్త నివేదికను ఎన్జీటీ కి వీలైనంత త్వరగా ఇచ్చేలా చూడాలని లేఖలో కోరారు.

Latest News

More Articles