Sunday, May 12, 2024

అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ నాయకులవి అన్నీ అబద్ధాలే

spot_img

హన్మకొండ జిల్లా : అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులు అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలపై ప్రజలు ప్రశ్నిస్తారనే అసెంబ్లీ సాక్షిగా అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు.

Also Read.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

‘‘కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు వారెంటీనే లేదు.. వాళ్ళను చూసి ప్రజలు నవ్వుకుంటున్నరు. మంత్రి కొండా సురేఖ వరంగల్ సెంట్రల్ జైల్ గురించి ప్రస్తావిస్తూ బ్రహ్మాండమైన జైలు కూల్చారు అంటున్నారు.. అది నిజాం, బ్రిటీష్ కాలం నాటిది. కేసిఆర్ విద్యా, వైద్యంపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా వరంగల్ లో రూ. 11 వందల కోట్లతో 24 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. అలాంటి ఆస్పత్రిని హేళన చేసేలా మాట్లాడుతున్నారు. జైలు ఎక్కడ ఉంటే ఏంటి?

Also Read.. కిరణ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు.. తెలంగాణ పరువు తీస్తున్నారు.. ఓవైసీ నిప్పులు

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంజీఎం ఎలా ఉండేది. ఇప్పడు ఎంజీఎం పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ప్రజలకు కావాల్సిన పరిపాలన అందించాలని.. మంత్రులు, పరిపాలనా యంత్రాంగం ఒకే దగ్గర ఉండాలని అంబేద్కర్ పేరుతో సచివాలయం ఏర్పాటు చేశారు. విద్యా, వైద్య రంగాలకు కేసిఆర్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. గతంలో ఎంజీఎం ఆస్పత్రికి, పాఠశాలలకు నిధులు ఇవ్వాలంటే స్పందించలేదు. కేసీఆర్ హయాంలో విద్యా, వైద్యాన్ని ఎలా అభివృద్ధిపరిచారో చూడాలి. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబితే ప్రజలు ఊరుకోరు.

Also Read.. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి

దేశంలో ఎక్కడా లేని విధంగా కేసిఆర్ కిట్ అమలు చేశాం. ఉమ్మడి రాష్ట్రంలో 3 – 4 మెడికల్ కాలేజీలు ఉంటే.. కేసిఆర్ అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారు. బస్తీ, పల్లె దవాఖానల ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత కేసిఆర్ ది. జైళ్లు ఊరి అవతల ఉంటే ఏంటి.. ఆస్పత్రులు సిటీ మధ్యలోనే ఉండాలి. సభను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ నేతల మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

Also Read.. తెలంగాణ పరువు తీస్తున్నారు.. సీఎం రేవంత్ పై అక్బరుద్ధీన్ నిప్పులు

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి. ఆటో డ్రైవర్ల పరిస్థితి పరిగణనలోకి తీసుకుని వారిని కూడా ఆదుకోవాలి. వరంగల్ జిల్లా ప్రజలు కొండా సురేఖ చేసిన ప్రకటనను స్వాగతించరు. వరంగల్ లో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఎక్కడ ఆగిపోతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దు.’’ అని సూచించారు.

Latest News

More Articles