Sunday, May 19, 2024

హైదరాబాద్ కి మరో 5 DMHOలు.. వైద్యారోగ్య శాఖలో కీలక మార్పులు

spot_img

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు వేసింది. ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం రూపొందించిన కమిటీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తూ జీఓ నెంబర్ 142 ను గురువారం విడుదల చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో మానవ వనరుల హేతుబద్ధీకరణ ప్రక్రియకు అనుమతించింది.

పేషంటు లోడుకు అనుగుణంగా తగిన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా కోటి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ లో ఇప్పటివరకు ఒక్క DMHO మాత్రమే ఉండేవారు. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా వైద్యారోగ్య అధికారుల పెంపును గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ప్రస్తుత, భవిష్యత్ వైద్య అవసరాలు గుర్తించిన ప్రభుత్వం అదనంగా 5 DMHO లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. చార్మినార్, ఎల్బి నగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ GHMC జోన్ల వారీగా వీటి ఏర్పాటుకు అంగీకరించింది. దీంతో GHMC పరిధిలో మొత్తం 6 DMHO లు ఉంటారు. కొత్త DMHO లను కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 38 DMHO లు ఉంటారు.

Latest News

More Articles