Friday, May 17, 2024

బాబోయ్ నిలువు దోపిడీ.. మేడారం వెళ్లాలంటే ఇన్ని ఛార్జీలు కట్టాలా?

spot_img

ప్రజాప్రభుత్వం అంటే ఏంటో ప్రజలకు చూపెడుతున్నారు రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్. ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేస్తేనే ఆరు గ్యారెంటీలు ఇస్తామని రైతులు, మహిళలు, యువత అందరిని నట్టేటా ముంచుతూ సీఎం రేవంత్ బహిరంగ ప్రకటన చేశాడు. అయితే ప్రస్తుతం భక్తులపై కూడా భారీ చార్జీల భారం వేయనుంది రేవంత్ కాంగ్రెస్ సర్కార్. మేడారం జాతరకి వెళ్లే భక్తులపై ఛార్జీల భారం పెంచనుంది. మేడారానికి వాహనాల్లో వచ్చే భక్తుల నుంచి టోల్ ఛార్జీలతో పాటు పార్కింగ్, పర్యావరణ ఛార్జీలను వసూలు చేయబోతున్నట్లు తెలుస్తుంది.

మేడారం సమ్మక్క సారక్క జాతర జరిగే 45km పరిధిలోనే 3 చోట్ల టోల్ గేట్స్ పెట్టి ముక్కుపిండి వసూళ్లు చేయనుంది ప్రభుత్వం. దీంతో మూడో చోట్ల ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందని వాహనదారులు చెబుతున్నారు. జవహర్ నగర్ వద్ద టోల్ ఫీజుగా రూ.100-200 తీసుకుంటున్నారు. అటవీశాఖ తనిఖీ కేంద్రాల వద్ద రూ.50-200 వసూలు చేస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. దీంతో కనీసం జాతర పూర్తయ్యే వరకైనా ఈ ఛార్జీలు వసూలు చేయడం నిలిపివేస్తే బాగుంటుందని సమ్మక్క- సారలమ్మలను దర్శించుకోవాడానికి వెళ్లే భక్తులు కోరుకుంటున్నారు.

Latest News

More Articles