Sunday, May 19, 2024

మంద కృష్ణ ఏడుపు నాటకం.. మోడీ ఓదార్పు బూటకం

spot_img

హైదరాబాద్: వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని ఎందుకు స్పష్టంగా కిషన్ రెడ్డి చెప్పట్లేదు సమాధానం చెప్పాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని అధికారం వచ్చిన పదేళ్లు గడుస్తున్న కేవలం ఎన్నికల ముందే వర్గీకరణ విషయంలో హడావిడి చేయడం దేనికి సంకేతం అని టాస్క్ ఫోర్స్ కమిటీని నియమిస్తున్నామని కిషన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మరోసారి మాదిగలను మోసం చేయడమేనని మండిపడ్డారు. మంగళవారం విద్యానగర్లోని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Also Read.. ఆంధ్రోళ్లకు మనకు జరిగే యుద్ధమే ఈ ఎన్నికలు

వర్గీకరణ పై టాస్క్ఫోర్స్ కమిటీ వేసేమని చెబుతున్న కిషన్ రెడ్డి.. వర్గీకరణ విషయంలో ఎందుకు స్పందించలేదని వారు ప్రశ్నించారు. వర్గీకరణ చేసి ఓట్లు అడగకుండా చేస్తామని మాటలు చెబుతూ మాదిగలను మోసం చేస్తున్నారని ఓట్లు అడిగే నైతిక హక్కు బిజెపి పార్టీకి లేదని వారు దుయ్యబట్టారు. వర్గీకరణ అంశంలో తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి పంపినప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. గత పది ఏళ్లుగా ఎన్నిసార్లు పార్లమెంట్ సమావేశాలు జరిగిన ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

Also Read.. ఎస్ఐ ని ట్రాక్ట‌ర్ తో తొక్కించి హత్య చేసిన ఇసుక మాఫియా

హైదరాబాదులో బిజెపి కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు శ్వేతపత్రం ఇవ్వడానికి వెళ్లిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను రక్తం కారేటట్టు కొట్టింది బిజెపి పార్టీ కాదా అని వారి ప్రశ్నించారు. దెబ్బలు తిన్న కార్యకర్తలను చూసి ఈ గాయాల సాక్షిగా బిజెపి మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించిన మందకృష్ణ మోదీ కాళ్లు మొక్కి మూల్యం చెల్లించుకున్నాడని స్పష్టం చేశారు.

Also Read.. ఖమ్మంపై నాకున్న ప్రేమ.. బయటి నుండి వచ్చిన తుమ్మలకు ఉంటదా?

మందకృష్ణ ఇకనైనా మాదిగల ఓట్లను అమ్ముకోవడం మానేయాలని వంగపల్లి సూచించారు. 2018లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 2023లో బిజెపి పార్టీకి మాదిగల ఓట్లు అమ్ముతున్నారని విమర్శించారు. బిజెపి పార్టీ మాదిగలను మోసం చేసే దిశగా కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తుందని వంగపల్లి అన్నారు. ఏడుగురు న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన కిషన్ రెడ్డి ఆ ఏడుగురు న్యాయమూర్తుల పేర్లు, దాని కాలపరిమితి ఎంతో చెప్పాలని వంగపల్లి ప్రశ్నించారు.

Latest News

More Articles