Thursday, May 2, 2024

ఖమ్మంపై నాకున్న ప్రేమ.. బయటి నుండి వచ్చిన తుమ్మలకు ఉంటదా?

spot_img

ఖమ్మం జిల్లా: ఖమ్మంపై తనకున్న ప్రేమ బయట నుండి వచ్చిన వ్యక్తి తుమ్మలకు ఉండదని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం నగరం త్రీ టౌన్ లోని 33, 34, 35, 36వ డివిజన్ లో నిర్వహించిన రోడ్ షో లో పువ్వాడ మాట్లాడారు. తాను ఇక్కడి భూమి పుతృడను.. ఖమ్మం బిడ్డను. రెండు సార్లు నన్ను ఆదరించి గెలిపించిన విధంగానే మళ్ళీ ఈ సారి కూడా గెలిపించాలని కోరారు. తనపై గెలవలేక నా నామినేషన్ ను తిరస్కరించాలి అని ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విషం చిమ్ముతున్నాడని, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసారని అన్నారు.

Also Read.. కేసీఆర్ కోసం దేశం చూస్తోంది.. బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరు

ఖమ్మంలో కనీసం కాకరకాయ కూడా పంచని వాడు ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి తగుదునమ్మా అంటూ ఇపుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని విమర్శించారు. అతని 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరిని ఎదగనివ్వకపోగా వెన్ను పోట్ల పొడిచిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. గతంలో మంత్రి పదవి ఇచ్చిన ఎన్టీఆర్ ని, కేసీఅర్ ని వెన్నుపోటు పొడిచిన ఘనత తుమ్మలకే దక్కుతుంది అన్నారు. తాను రాజకీయాల్లో ధర్మంగా ఉంటాను.. అధర్మంగా ఉండను.  కానీ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల అతని జీవితాంతం అధర్మ పోరాటాలు చేసి ఓడిపోవడం పరిపాటిగా మారిపోయిందన్నారు.

Also Read.. కాంగ్రెస్ పని అయిపోయింది.. బిజెపికి క్యాడర్ లేదు

అభివృద్ది పథంలో ఖమ్మం ఉండాలి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గెలవాలి. 70 ఏళ్ల చరిత్రలో ఖమ్మంకు మంత్రి పదవి రాలేదు.. తొలి సారి నాకే వచ్చింది.. దాన్ని ఖమ్మం అభివృద్ది కోసమే పని చేసిన విషయం మీకు తెలుసు అన్నారు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఖమ్మం అభివృద్ది కోసమే వినియోగించడం జరిగిందని, ఇక ముందు కూడా ఇదే తరహాలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

Also Read.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం

ఒకప్పుడు కనీస సదుపాయాలు లేని ఖమ్మం.. నేడు ఆదర్శవంత ఖమ్మంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. లకారం ట్యాంక్ బండ్, ఖమ్మం జిల్లా యువత కోసం ఐటి హబ్, పిల్లలు, పెద్దల ఆరోగ్యం కోసం పార్క్ లు, ఓపెన్ జిమ్ లు, వాకింగ్ ట్రాక్, క్రీడా ప్రాంగణాలు, ప్రజల కోసం నూతన బస్ స్టాండ్, దంసలాపురం ROB బ్రిడ్జి, నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనం, ప్రజా ఆరోగ్యం కోసం బస్తీ దవాఖాన లు ఇలా అనేక అభివృద్ది పనులు చేపట్టామని వివరించారు. త్వరలోనే మున్నేరుపై రూ .180 కోట్లతో నూతన తీగల వంతెన, ప్రభుత్వ మెడికల్ కళాశాల, రూ.680 కోట్లతో మున్నేరు ముంపు నుండి రక్షించే RCC రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజలకు ఆహ్లాదం పంచే విధంగా మున్నేరు రివర్ ఫ్రంట్ పేరుతో అభివృద్ది చేయనున్నమని తెలిపారు. మన ఈ అభివృధ్ది ఇలానే సాగాలంటే మళ్ళీ తనకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రానికి కేసీఅర్ శ్రీరామ రక్ష అని, కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను మంత్రి పువ్వాడ కోరారు.

Latest News

More Articles