Saturday, May 11, 2024

కాంగ్రెస్ పని అయిపోయింది.. బిజెపికి క్యాడర్ లేదు

spot_img

హైదరాబాద్: కాంగ్రెస్ పని అయిపోయిందని, బిజెపికి క్యాడర్ లేదని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రజలు బాధ పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే వచ్చే కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కొడంగల్ లో బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Also Read.. మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట.. ఓటేసి అండగా నిలవాలి

పథకాలను అందించే కేసీఆర్ ప్రభుత్వం కావాలా… ప్రజల్లో తిరిగే నరేందర్ రెడ్డి కావాలా… 70 ఏళ్లు ప్రజలను దగా చేసిన కాంగ్రెస్ కావాలా.. పదేళ్లు కొడంగల్ లో ఒక్క ఊరు తిరగని రేవంత్ రెడ్డి కావాలా ఆలోచించుకోవాలని కోరారు. ఎవరు ఎన్ని చెప్పినా మూడోసారి కెసిఆర్ సీఎంగా, కొడంగల్ లో రెండోసారి ఎమ్మెల్యేగా నరేందర్ రెడ్డి కావడం ఖాయం అన్నారు.

Also Read.. BRS అభ్యర్థులు గెలిస్తేనే పథకాలు కొనసాగుతాయి

కాంగ్రెస్లో పదిమంది సీఎం అభ్యర్థులు ఎవరికి వారే తాము సీఎం అవుతున్నట్లు ప్రకటించుకుంటున్నారు. రైతులకు రైతు బంధు కింద పెట్టుబడి సహాయం, భీమా, 24 గంటల కరెంటు సరఫరా, మంచి మద్దతు ధర ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది అని మంత్రి చెప్పారు.

Latest News

More Articles