Sunday, May 19, 2024

కృష్ణార్జునుల స్కెచ్చులకు.. ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్

spot_img

తెలంగాణ ఏర్పాటు తరువాత ఒంటిచేత్తో బీఆర్ఎస్ పార్టీని గద్దెనెక్కించారు సీఎం కేసీఆర్. సొంత వ్యూహాలతో ప్రత్యర్దులని చిత్తుచేసి రెండు సార్లు సీఎం పీఠం ఎక్కిన గులాబీ బాస్ హ్యాట్రిక్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. అయితే అందరు బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అని అనుకుంటారు. అది అక్షరాలా నిజం కూడా. కానీ సీఎం కేసీఆర్ వ్యూహాలను గ్రౌండ్ లెవెల్లో అంతే స్థాయిలో అమలు చేసే నాయకులు బీఆర్ఎస్ లో ఇద్దరు ఉంటారు. వారిద్దరే కేటీఆర్, హరీష్ రావు. బిఆర్ఎస్ ను వెనుక ఉంటూ ముందుకు నడిపించే శక్తులు కేటీఆర్, హరీష్ రావు. గత రెండు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం వీరిద్దరు చేసిన కృషి అందరికీ తెలిసిందే. ఈ సారి కూడా ఇద్దరు అదే పనిలో ఉన్నారు.ప్రతిపక్ష పార్టీల మాటలకు తూటాల వంటి సమాధానాలు ఇచ్చి మారు మాట్లాడకుండా చేయగల సమర్థులైన ఈ బావాబామ్మర్దులు..పార్టీ హ్యాట్రిక్ కోసం కష్టపడుతున్నారు. మామకు తగ్గ అల్లుడు ఒకరైతే, తండ్రికి తగ్గ తనయుడు మరొకరు.

కేంద్రం నుండి నిధులు సాధించాలన్నా, పెట్టుబడులను ఆకర్షించాలన్న, క్షేత్ర స్థాయిలో పార్టీని బలపర్చాలన్న, పార్టీలో విభేదాలు చక్కదిద్దాలన్న, ప్రత్యర్ధులకు చెక్ పెట్టాలన్న.. ఈ బావాబామ్మర్దుల తీరు ప్రత్యకం. వేరే పార్టీ నేతలు తమ పార్టీ వైపు ఆకర్షించాలని ఈ జోడి వ్యూహాలు ఎవరికి అర్థం కాదు. వీరిద్దరి అండతోటి కే‌సి‌ఆర్ నాలుగు నెలలు ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ విపక్ష పార్టీలకు షాక్ లు ఇస్తుంటారు. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత అసమ్మతి నేతలు భారీగా వలసలు ఉంటాయని కాంగ్రెస్ బిజెపి నేతలు ఆశించారు. కానీ కేటీఆర్, హరీష్ రావు వ్యూహాలతో కాంగ్రెస్, బిజెపి ఆశలపై నీళ్లు చల్లారు. తెలంగాణలో బిఆర్ఎస్ ను నిలబెట్టేది ఈ కృష్ణార్జునులే అన్నది జగమెరిగిన సత్యం. మరి సీఎం కేసీఆర్ చరిష్మా, వీరి వ్యూహాలతో ఎన్నికల కురుక్షేత్రంలో బీఆర్ఎస్ కు హ్యాట్రిక్ విజయం సునాయాసమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Latest News

More Articles