Sunday, May 19, 2024

ఎక్కడికక్కడ పోలీసుల తనిఖీలు.. ఇప్పటివరకు రూ. 20 కోట్లు స్వాధీనం

spot_img

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రం మొత్తం రాజకీయంగా హీటెక్కింది. ఆయా పార్టీలు తమ ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. కాగా.. ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పాటు.. ఈసీ ఆదేశాలతో తెలంగాణలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలలో భారీగా డబ్బు , బంగారం పట్టుబడుతున్నాయి. తనిఖీలతో పాటు హవాలా లావాదేవీలపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 20 కోట్ల 43 లక్షల 38 వేలు పట్టుబడ్డాయి. వీటిలో రూ. 14 కోట్ల 65 లక్షల 50 వేల విలువైన బంగారం, వెండి సీజ్ చేశారు. వీటితో పాటు సుమారు కోటివిలువైన మద్యం సీజ్ చేశారు. ఈ తనిఖీలలో 1196 మందిపై కేసులు నమోదు చేశారు. అంతర రాష్ట్ర చెక్ పోస్ట్‎లు 89, ఇతర రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్‎లు 169 ఏర్పాటు చేశారు. తాజాగా రెండు రోజుల క్రితం బంజారాహిల్స్‎లో 3.35కోట్ల హవాలా నగదు పట్టుబడింది. బషీర్ బాగ్‎లో ఏడు కిలోల బంగారం, 295 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. చందానగర్‎లో ఆరు కిలోల ఆర్నమెంట్ బంగారం పట్టుకున్నారు. సరిహద్దు చెక్ పోస్ట్‎లలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎవరి దగ్గరైనా రూ. 50 వేలకు మించి ఉంటే స్వాధీనం చేసుకుంటున్నారు. నగదు రవాణాకు సరైన పత్రాలు చూపాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేస్తున్నారు.

Read Also: మూడు పంటల వైపా? మూడు గంటల కరెంట్ వైపా?

Latest News

More Articles