Friday, May 3, 2024

వ్యవసాయానికి సాగునీటిని అందిస్తున్న ఘనత కేసీఆర్ ది

spot_img

జనగామ జిల్లా:  ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీరు,త్రాగు నీరు అందించాలనే ఉద్దేశంతో 2003 లో దేవాదుల పనులను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అశ్రద్ద వల్ల సాగునీటి ప్రాజెక్టులు అప్పట్లో నెమ్మదిగా సాగాయని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పొన్నాల భారీ నీటి పారుదల మంత్రిగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు న్యాయం జరుగలేదన్నారు. జఫర్గడ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కడియం మాట్లాడారు.

ఉద్యమ నాయకుడే కేసీఅర్ ముఖ్యమంత్రి అయ్యారు. వ్యవసాయానికి ప్రోత్సహం అందిస్తూనే సాగునీటిని అందిస్తున్న ఘనత కేసీఆర్ ది. కాళేశ్వరంతో తెలంగాణ సస్యశామలం అవుతుంది. ఒక్కప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా దిగుబడి రాలేదు. ఇప్పుడు ఒక్క జనగామ జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నారు.

Latest News

More Articles