Friday, May 17, 2024

ఇన్నోవేషన్‌లో రాష్ట్రమే టాప్‌.. చివరన గుజరాత్‌

spot_img

న్యూఢిల్లీ: నేషనల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇన్నోవేషన్‌ సర్వే 2021-22లో తెలంగాణ రాష్ట్రం టాప్ పొజిషన్ లో నిలిచి సత్తా చాటింది. ఇందులో ప్రధాని మోడీ గుజరాత్ అట్టడుగు స్థానంలో ఉండటం గమనార్హం. దీంతో గుజరాత్ మోడల్ డొల్లేనని తేలిపోయింది.

కొత్త రాష్ట్రమైన తెలంగాణ.. కేసీఆర్ పాలనాదక్షతతో.. పరిశ్రామిక రంగంలో విప్లవాత్మక విధానాలతో విజయవంతంగా దూసుకుపోతుంది. ల్లో కొత్త విధానాలు అమలుచేయటంలో నంబర్‌ వన్‌ స్థానంలో దూసుకుపోతున్నది. దేశంలోని ఎంఎస్‌ఎంఈల్లో ఇన్నోవేషన్‌ విధానాలపై కేంద్రంలోని శాస్త్ర సాంకేతిక విభాగం ఈ సర్వే నిర్వహించారు.

దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోనే పరిశ్రమల్లో ఉత్పత్తి, మార్కెటింగ్‌, సాంకేతికత వంటి రంగాల్లో కొత్త విధానాలను అమలు చేస్తున్నారని నేషనల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇన్నోవేషన్‌ సర్వే- 2021-22లో తేలింది. ఈ సర్వే నిర్వహించింది సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే. కేంద్రంలోని శాస్త్ర సాంకేతిక విభాగం ఈ సర్వే నిర్వహించింది.

మొత్తం 8,074 కంపెనీలను సర్వే చేయగా.. వీటిలో 25.01 శాతం మాత్రమే ఇన్నోవేషన్‌ను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నాయి. మిగతా 73.76 శాతం సంస్థలు పాత విధానాలతోనే ఉత్పత్తి, వ్యాపారం కొనసాగిస్తున్నట్లు చెప్పాయి. సర్వేలో 52.24 శాతం సూక్ష్మ, 29.26 శాతం చిన్న, 12,63 శాతం మధ్యతరహా, 5.87 శాతం భారీ పరిశ్రమలు పాల్గొన్నాయి.

Latest News

More Articles