Sunday, May 19, 2024

తెలంగాణ పండుగలు, కళలు ఎప్పటికీ వర్ధిల్లుత ఉండాలి

spot_img

ఎంతో ప్రత్యేక విశిష్టత కలిగిన తెలంగాణ పండగలను సగర్వంగా చాటి చెబుదామని, మన సంస్కృతిని ఇలానే కొనసాగిద్దామన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ పండగలు, కళలు ఎప్పటికీ వర్ధిల్లుతుండాలన్నారు. వందల ఏళ్ల నుంచి బతుకమ్మ పండుగతో సంస్కృతిని కాపాడుతున్న ఘనత మహిళలకు దక్కుతుందన్నారు. ఇవాళ(మంగళవారం) జగిత్యాల పట్టణంలో వైభవోపేతంగా జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొని..మాట్లాడారు.

మన సంస్కృతి కచ్చితంగా ఇలాగే కొనసాగాలి. సంస్కృతి లేని సమాజం అంటే వేర్లు లేని చెట్టు వంటిది. సంస్కృతిని మరిచిపోయే సమాజం బాగుండదు.. కాబట్టి పండగలను సగర్వంగా చాటి చెబుతూ ముందుకు తీసుకెళ్లాలన్నారు.

మొట్టమొదటిసారిగా తాను మైక్ ముందు బతుకమ్మ పాట పాడానని, యూట్యూబ్లో అందరూ ఆ పాట విని అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. రాబోయే తరాల్లో బతుకమ్మ పాట పదిలంగా ఉండేందుకు పిల్లలకు బతుకమ్మ పాటలు నేర్పించాలని కోరారు. సీఎం కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పల్లెలన్నీ నీళ్లతో, చెరువులతో కళకళలాడుతున్నాయన్నారు. అమ్మవారి దయతో తెలంగాణ ఇలానే సుభిక్షంగా ఉండాలని, మంచిగా పంటలు ఉండాలని ఆకాంక్షించారు ఎమ్మెల్సీ కవిత.

ఇది కూడా చదవండి:నేను బతికి ఉన్నంతకాలం దళిత బంధు ఆగదు

Latest News

More Articles