Saturday, May 18, 2024

రేపే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా..సెక్రటేరియట్ లో గుడి, చర్చి, మసీద్ ప్రారంభం

spot_img

సచివాలయం ప్రాంగణంలో రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దేవాలయం, మసీద్, చర్చి ప్రారంభం కానున్నాయి. ఈ ఏర్పాట్లని మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. మంత్రి కొప్పుల వెంట ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కోరుకంటి చందర్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ ఎండి కాంతి వేస్లి, తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, పలువురు క్రిస్టియన్ మైనారిటీ నేతలు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలను, అన్ని మతాలను గౌరవిస్తారు. అందుకే సచివాలయంలో గుడి, మజీద్, చర్చి నిర్మాణం చేపట్టారు. గతంలో చర్చి లేకుండే ఇవాళ అన్ని మతాలకు అన్ని సౌకర్యాలతో గుడి,మజీద్,చర్చి నిర్మాణం చేశారు. రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమ్ చేసుకోవడం జరుగుతుంది.
పనులు అన్ని పూర్తి అయ్యాయి’ అని అన్నారు మంత్రి కొప్పుల.

Latest News

More Articles