Friday, May 3, 2024

ఎలన్ మస్క్ ఇండియా టూర్ క్యాన్సిల్..కారణం ఇదే.!

spot_img

ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్..భారత్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆ ట్రిప్ ను వాయిదా వేసినట్లు కొన్ని వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. టెస్లా ఎలక్ట్రిక్ కారు కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీతో మస్క్ భేటీ అవ్వాల్సింది . కానీ తన పర్యటనను మర్క్ రద్దు చేసుకున్నట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. ఇండికాలో కార్లు ప్రాజెక్టుపై మస్క్ ప్రకటన చేస్తారని గత కొన్నాళ్లుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో సుమారు 3 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది. దాదాపు 25లక్షల ఖరీదు చేసే మోడల్ 2 రకం ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కోసం ఆ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరగనున్న స్పేస్ స్టార్టప్స్ కంపెనీలతో మస్క్ సమావేశం కావాల్సి ఉంది.

&

యునైటెడ్ స్టేట్స్‌లో ఏప్రిల్ 23న టెస్లా మొదటి త్రైమాసిక పనితీరుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి మస్క్ ముఖ్యమైన కాన్ఫరెన్స్ కాల్‌లో ఈ ట్రిప్ వాయిదా వేసుకున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఎందుకు వాయిదా వేశారన్న విషయం పై ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు.

ఇది కూడా చదవండి: పక్కటెముకల కింద నొప్పి ఉందా? గుండెపోటు రావచ్చు?

Latest News

More Articles