Friday, May 17, 2024

ఎన్నికల ముందు నలుగురికి చైర్మన్ పదవులిచ్చిన సీఎం కేసీఆర్

spot_img

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాలకు చెందిన ప్రస్తుత ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్యలను ఈ సారి సీట్లు దక్కలేదు. దాంతో వారిద్దరూ అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి వారిద్దరికి చైర్మన్ పదవులిచ్చి సీఎం కేసీఆర్ కూల్ చేశారు.

Read Also: రైతుల కోసం సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్‎గా నియమించగా.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని టీఎస్ ఆర్టీసీ చైర్మన్‎గా నియమించారు. అదేవిధంగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్‎గా ఉప్పల వెంకటేష్ గుప్తాను నియమించారు. ఇక తాజాగా కాంగ్రెస్ నుంచి మల్కాజిగిరి టికెట్ ఆశించి, భంగపడ్డ సీనియర్ నాయకుడు నందికంటి శ్రీధర్.. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే బీఆర్ఎస్ ఆ టికెట్ ను ఇప్పటకే మరో అభ్యర్థికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దాంతో శ్రీధర్‎కు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: కానిస్టేబుల్ కొలువుల జాతర.. ఒక్కో ఇంట్లో ముగ్గురు, నలుగురికి జాబ్స్

Latest News

More Articles