Sunday, May 19, 2024

అమెరికా ఘటన మర్వకముందే.. బ్రిటన్‌ ప్రధాని నివాసం వద్ద కారు బీభత్సం..!

spot_img

హైదరాబాద్: ఇటీవల అగ్రరాజ్యం అమెరికాలోని వైట్‌ హౌస్‌వైపు ఓ ట్రక్కు దూసుకెళ్లిన విషయం మరువకముందే.. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అధికారిక నివాసమైన లండన్‌లోని 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ గేటును ఓ వ్యక్తి కారుతో బలంగా ఢీ కొట్టడం కలకలం రేపుతోంది. కాగా, ఈ ఘటన జరిగిన సమయంలో ప్రధాని రిషి సునాక్‌ తన కార్యాలయంలోనే ఉన్నారు.

బ్రిటన్ పోలీసుల  కథనం ప్రకారం.. ఈ ఘటన గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.  కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని,  ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Latest News

More Articles